బక్రీద్ నేపథ్యంలో కట్టుదిట్టమైన నిఘా..
మన భారత్, ఆదిలాబాద్ టౌన్: బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లాలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసినట్లు జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు. అక్రమ పశువుల రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా జిల్లాలో మొత్తం 7 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఈ చర్యల ద్వారా పండుగ సమయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలోని ప్రధాన మార్గాలైన పిప్పర్వాడ, ఉట్నూర్ ఎక్స్ రోడ్ వంటి కీలక...