22 ఏళ్లకే 10 ప్రభుత్వ ఉద్యోగాలు..!
మన భారత్, విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాల కృషి, పట్టుదల, సమయపాలన అవసరం. అయినప్పటికీ విజయం ఖాయం అవుతుందన్న హామీ ఉండదు. అలాంటి పోటీ ప్రపంచంలో కేవలం 22 ఏళ్ల వయసులోనే పది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది విజయవాడకు చెందిన గంటె సుజితశ్రీ. ఆమె విజయం ఇప్పుడు యువతకు స్ఫూర్తిదాయకంగా మారింది. సుజితశ్రీ కుటుంబ నేపథ్యం సాధారణమే. తండ్రి మోహనరావు ప్రైవేట్ ఉద్యోగి...