నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు..
మన భారత్, ఆదిలాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. ప్రజా పాలనలో భాగంగా ప్రజల నుంచి అందిన ప్రతి దరఖాస్తును నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడిన కలెక్టర్, ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులందరూ బాధ్యతతో వ్యవహరించి, ఎలాంటి ఆలస్యం...