కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యత అవసరం
మన భారత్, ధన్వాడ: మండల కేంద్రమైన ధన్వాడలో శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన రహదారి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచాయతీ బిల్ కలెక్టర్ బాలకృష్ణ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ మండల అధ్యక్షురాలు రాణి మాట్లాడుతూ, కార్మికుల హక్కుల కోసం జరిగిన చారిత్రక పోరాటాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సీఐటీయూ నాయకులు కే.కాశప్ప మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసి సాధించుకున్న...