నిధులు మంజూరు.. నిలిచిపోయిన రోడ్లు పనులు.!
మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని కప్పర్దేవి గ్రామంలో సీసీ రోడ్లు, నాలాల నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం పట్ల గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో రోడ్లు సరిగా లేకపోవడంతో వర్షాలు పడితే ఇళ్లలోకి నీరు చేరుతున్నదని, చిన్నపిల్లలు, వృద్ధులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ సమస్యపై కొత్తగా...