manabharath.com
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 4:16 am Editor : manabharath

పీఆర్ఆర్ జన్మదిన వేడుకలో జాదవ్ శ్రావణ్ కుమార్ 

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పీఆర్ఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జాదవ్ శ్రావణ్ కుమార్ పాల్గొని పీఆర్ఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి, నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జాదవ్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, పీఆర్ఆర్ సేవలను కొనియాడుతూ ఆయన సమాజానికి చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడగా, పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..