రుణమాఫీ రైతు భరోసా ఇవ్వాలని రైతు ఆమరణ దీక్ష..!
మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్): రెండు లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా సకాలంలో చెల్లింపు, పంట బీమా అమలు వంటి డిమాండ్లతో తలమడుగు మండలానికి చెందిన రైతు కె. కిషోర్ రావు ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు ఆమరణ దీక్ష చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆయన ఈ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కిషోర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యారంటీలను...