బార్ అసోసియేషన్ కార్యదర్శిని అభినందించిన కేటీఆర్
ఆదిలాబాద్, మన భారత్: ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ సాధారణ కార్యదర్శిగా ఎన్నికైన అడ్వొకేట్ కేమ శ్రీకాంత్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. యువ న్యాయవాదులు నాయకత్వ స్థానాల్లోకి రావడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. న్యాయవాదుల మధ్య ఐక్యత పెంపొందించడంతో పాటు, వారి హక్కుల సాధనలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, యువత ముందుకు రావడం వల్ల సంస్థలకు కొత్త ఉత్సాహం, దిశ లభిస్తుందని అన్నారు. న్యాయవాదుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి...