పది ఉత్తీర్ణత విద్యార్థులకు అభినందనలు..
మన భారత్, మొగుళ్ళపల్లి: పదో తరగతి పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. బుధవారం విడుదలైన ఫలితాల సందర్భంగా ఆయన విద్యార్థుల కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ముప్పు సురేష్ మాట్లాడుతూ, విద్యార్థులు చూపించిన పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర శ్రమ ఈ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. లక్ష్యసాధనలో క్రమబద్ధమైన చదువు, సమయపాలన ఎంతో కీలకమని అన్నారు. అలాగే విద్యార్థులను విజయపథంలో నడిపించిన ఉపాధ్యాయులకు, వారిని...