రైతులకు మౌలిక సదుపాయాలు తప్పనిసరి..
మన భారత్, మొగుళ్లపల్లి: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమగ్రంగా కల్పించాలని తహసీల్దార్ జాలీ సునీతా రెడ్డి నిర్వాహకులకు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మండల వ్యవసాయ శాఖ అధికారి పి. సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వరి కోత హార్వెస్టర్ల యజమానులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులకు పంట కోత...