నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం
మన భారత్, తెలంగాణ: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా నియమితులైన సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీజీపీ సీవీ ఆనంద్‌కు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో చట్టవ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా పని...