manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 10:22 am Editor : Editor Vishal Kumar

నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం

మన భారత్, తెలంగాణ:

రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా నియమితులైన సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీజీపీ సీవీ ఆనంద్‌కు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో చట్టవ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా పని చేయాలని ఆకాంక్షించారు.

డీజీపీ సీవీ ఆనంద్ కూడా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను మరింత ప్రజానుకూలంగా, పారదర్శకంగా మార్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో మరింత చురుకుదనం రావాలని ఆశాభావం వ్యక్తమవుతోంది.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..