కాలి బుడిదైన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే
మన భారత్ ,మొగుళ్లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గణేష్ పల్లి, పెద్దకొమటి పల్లి గ్రామాల పరిధిలో రైతులు కష్టించి పండించిన మొక్కజొన్న పంట అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన ఈ ప్రమాదంలో సుమారు 17 ఎకరాల పంట నష్టపోయింది. స్థానికుల వివరాల ప్రకారం, శనివారం విద్యుత్ వైర్లు ఒకదానికొకటి ఆనుకోవడంతో మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా వ్యాపించి సమీపంలోని మొక్కజొన్న పొలాలను చుట్టుముట్టాయి....