అటవీ ఉత్పత్తుల కొనుగోలు ప్రారంభం..
మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రాంతంలో గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అటవీ ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో ఈ కొనుగోళ్లు చేపట్టామని జీసీసీ డివిజనల్ మేనేజర్ సందీప్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అడవుల్లో గిరిజనులు సేకరించే వివిధ అటవీ ఉత్పత్తులకు సరైన ధర అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్ప పువ్వు, ఇప్ప పరక, తేనె, మైనం,...