పింఛన్లలో అక్రమాలకు చెక్..!
మన భారత్, హైదరాబాద్: రాష్ట్రంలో చేయూత పింఛన్ల పంపిణీలో పారదర్శకత పెంచుతూ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతున్న ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని ఇకపై రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లోనూ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానం ద్వారా పింఛన్ల పంపిణీలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు నకిలీ లబ్ధిదారులను గుర్తించి తొలగించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా చనిపోయిన వారి పేర్లతో అక్రమంగా...