manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 7:51 am Editor : Editor Vishal Kumar

ఎమ్మెల్యేకు డాక్టరేట్… ప్రజా సేవకు అంతర్జాతీయ గుర్తింపు

మన భారత్ , న్యూఢిల్లీ/ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే Anil Jadhav కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ United American University లీడర్షిప్ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

న్యూఢిల్లీలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈ గౌరవాన్ని స్వీకరించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలులో చూపిన కృషికి గుర్తింపుగా ఈ డాక్టరేట్ అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా డా. అనిల్ జాదవ్ మాట్లాడుతూ, ప్రజలతో కలిసి ఉండటం, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం తనకు అలవాటైందని అన్నారు. ఎండనక, వాననక ప్రజల కోసం పనిచేయడమే తన ధ్యేయమని, అదే తనకు ఈ గౌరవాన్ని తీసుకువచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల అభివృద్ధే తన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా మరింత సేవ చేయాలని సంకల్పించారు.

స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సాధించిన ఈ గౌరవం జిల్లాకు గర్వకారణమని అభిప్రాయపడ్డారు. గ్రామీణ అభివృద్ధి, గిరిజన సంక్షేమానికి చేసిన కృషి అంతర్జాతీయ వేదికపై ప్రశంసలు పొందడం విశేషంగా భావిస్తున్నారు.

ఈ అవార్డు ద్వారా ప్రజా సేవకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం మరోసారి స్పష్టమైందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..