manabharath.com
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 7:29 pm Editor : manabharath

ఆర్టీసీ కార్మికులకు ధైర్యం కోల్పోవద్దు…

మన భారత్ | మొగుళ్లపల్లి:

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో భావోద్వేగాలకు లోనవకుండా ధైర్యంగా పోరాటం కొనసాగించాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలు వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని ఆయన స్పష్టంగా విజ్ఞప్తి చేశారు.

శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లకు సమాజంలోని అన్ని వర్గాల మద్దతు ఉందన్నారు. తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సిందే కానీ ప్రాణాలు తీసుకునే స్థితికి వెళ్లకూడదని సూచించారు. ధైర్యంగా ముందుకు సాగితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బకాయిలు, హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మికులు సంయమనం పాటిస్తూ శాంతియుతంగా తమ ఆందోళన కొనసాగించాలని సూచించారు. తెలంగాణ సమాజం మొత్తం కార్మికుల పక్షాన నిలుస్తుందని, వారి పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన జరగాలని, బహుజన వర్గాల అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులు ఏవైనా కఠిన నిర్ణయాలకు పాల్పడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, వారి న్యాయమైన డిమాండ్లను గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..