నాణ్యత లేని సీసీ రోడ్డు.. పగుళ్లతో బయటపడిన నిర్లక్ష్యం
మన భారత్, ఆదిలాబాద్: మండలంలోని పొన్నారి గ్రామంలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డు నాణ్యతపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్తవాడలో నిర్మించిన ఈ రోడ్డు కొన్ని రోజుల్లోనే పగుళ్లు పడటం వివాదాస్పదంగా మారింది. గ్రామస్తుల సమాచారం ప్రకారం, నిర్మాణం పూర్తయిన కొద్ది రోజులకే రోడ్డు పైపొరలో చీలికలు కనిపించడం ప్రారంభమైంది. దీని వల్ల నిర్మాణ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరైన ప్రమాణాలు పాటించకుండా, నాణ్యత లేని పదార్థాలతో పనులు చేపట్టడం వల్లే ఈ పరిస్థితి...