కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్
మన భారత్, నల్లగొండ: నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యపై దశాబ్దాలుగా పోరాటం సాగించిన సామాజిక కార్యకర్త దుశ్చర్ల సత్యనారాయణ పై జరిగిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం దీర్ఘకాలంగా పోరాడుతున్న వ్యక్తిపై దాడి జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులను వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు....