42 డిగ్రీలు.. భగ్గుమంటున్న ఎండలు
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం (24-04-2026) జిల్లా కేంద్రంలో ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్‌ను దాటగా, పరిసర మండలాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ రూరల్ మండలం, బేల, జైనథ్, బోరజ్, సాత్నాల ప్రాంతాల్లో కూడా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండగా, సాయంత్రం 5 గంటల వరకు వేడి కొనసాగింది. అనంతరం ఉష్ణోగ్రతలు క్రమంగా...