manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 2:54 pm Editor : Editor Vishal Kumar

ఆ ఏటీఎంలో మృతదేహం..!

మన భారత్, హైదరాబాద్:

హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

స్థానికుల సమాచారం మేరకు మెహదీపట్నం పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఏటీఎం తలుపును తెరిచి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ వ్యక్తి ఏటీఎంలోకి వెళ్లిన తర్వాత తలుపు లాక్ అయి లోపలే చిక్కుకుపోయినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. దీని వల్ల ఊపిరాడక మృతి చెందిన అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి గుర్తింపు ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మెహదీపట్నం పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో ఏటీఎం కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజలు ఏటీఎం కేంద్రాల్లోకి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..