వడదెబ్బ బారిన బాలుడు మృతి
మన భారత్, ఆదిలాబాద్ : తీవ్ర ఎండల ప్రభావం మరో అమాయక ప్రాణాన్ని బలితీసుకుంది. ఆదిలాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో నివసిస్తున్న సతీశ్, అనిత దంపతుల చిన్న కుమారుడు జశ్వంత్ (16) వడదెబ్బ కారణంగా మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. మంగళవారం పగటి వేళ తీవ్ర ఎండలో బయట తిరిగిన జశ్వంత్, ఇంటికి చేరుకున్న తర్వాత అలసటతో పడుకున్నాడు. అయితే రాత్రి నిద్రలోనే అతడు ప్రాణాలు విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడు మూగవాడిగా...