బస్సు పోయి… ఆటో వచ్చె.!
మన భారత్, తెలంగాణ: ఆర్టీసీ సమ్మె ప్రభావం రాష్ట్రంలోని జిల్లాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సాధారణంగా రద్దీగా ఉండే బస్సు డిపోలు, బస్ స్టాండ్లు నిశ్శబ్దంగా మారిపోయాయి. ప్రజా రవాణా నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో నడిచే మొత్తం 345 కార్పొరేషన్ బస్సులు, 295 అద్దె బస్సులు సమ్మె కారణంగా ఆగిపోయాయి. ఈ పరిస్థితిలో ఉద్యోగులు, విద్యార్థులు, రోగులు...