43°C దాటిన ఉష్ణోగ్రతలు.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి
మన భారత్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఉదయం ఏడు గంటలకే 35 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయానికి పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. మంచిర్యాల జిల్లాలోని వెలగనూరు ప్రాంతంలో 43.8°C, భీమారం మండలంలో 43.7°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే విధంగా ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో 43.4°C, ఆదిలాబాద్ జిల్లా...