ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ
మన భారత్, బీంపూర్: భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ప్రహరీ గోడ నిర్మాణానికి శుభారంభం జరిగింది. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరై రూ.60 లక్షల వ్యయంతో నిర్మించనున్న కాంపౌండ్ వాల్‌కు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, విద్యార్థినుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. పాఠశాల పరిసరాల్లో అనవసరంగా ఎవరూ ప్రవేశించకుండా ఉండేందుకు, విద్యార్థినులు ప్రశాంత వాతావరణంలో...