manabharath.com
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 5:33 pm Editor : manabharath

అదనపు ఎస్పీగా పదోన్నతి..

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా పోలీసు విభాగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. పోలీసు కార్యాలయంలో అడ్మిన్ ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న పి మౌనిక ఐపీఎస్ కి అదనపు ఎస్పీగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా జిల్లా పోలీసు శాఖలో ఆనంద వాతావరణం నెలకొంది.

సోమవారం అధికారికంగా పదోన్నతి పొందిన మౌనిక ఐపీఎస్ కి  జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో ఘనంగా అభినందనలు తెలిపారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు స్వయంగా భుజస్కందాలపై సింహ తలాటం చిహ్నాన్ని అలంకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం పోలీసు సిబ్బంది మధ్య ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

పదోన్నతి అనంతరం కూడా పి మౌనిక ఐపీఎస్  పోలీసు ముఖ్య కార్యాలయంలో అదనపు ఎస్పీ (అడ్మిన్)గా అదే బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఆమె సేవలు, పనితీరు దృష్ట్యా ఈ పదోన్నతి లభించిందని అధికారులు పేర్కొన్నారు.

జిల్లా పోలీసు సిబ్బంది, ఉన్నతాధికారులు మౌనిక ఐపీఎస్ గారికి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆమె నాయకత్వంలో పోలీసు శాఖ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) బి సురేందర్ రావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సీసీ కొండరాజు, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..