సమ్మె ప్రభావం: పురుషులకూ ఫ్రీ బస్ ప్రయాణం
మన భారత్, తెలంగాణ: తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ప్రభావం రోజురోజుకు స్పష్టంగా కనిపిస్తోంది. సిబ్బంది కొరత కారణంగా పలుచోట్ల మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలుగుతోంది. సాధారణంగా మహిళలకు మాత్రమే అమలులో ఉన్న ఫ్రీ బస్ పథకం, ప్రస్తుత పరిస్థితుల్లో పురుషులకు కూడా వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో బస్సుల నిర్వహణలో అంతరాయం కలగకుండా ప్రభుత్వం తాత్కాలికంగా ప్రైవేట్ వ్యక్తులను నియమించి సేవలను కొనసాగిస్తోంది. అయితే కండక్టర్ల...