manabharath.com
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 4:09 pm Editor : manabharath

ఆరోగ్యకర ఆహారంపై అవగాహన..

మన భారత్, మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని నాలుగో అంగన్వాడి కేంద్రంలో 8వ జాతీయ పోషణ పక్వాడా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఐసిడిఎస్ సూపర్వైజర్ రజిత ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ చాట్ల విజయ ముఖ్య అతిథిగా బుధవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సర్పంచ్ చాట్ల విజయ, పోషకాలతో కూడిన ఆహారం ప్రతి కుటుంబంలో భాగం కావాలని సూచించారు. ముఖ్యంగా చిరుధాన్యాలు, సహజ ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. బయట తయారయ్యే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వంటివి దూరంగా ఉంచితేనే పిల్లలు మరియు మహిళలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు.

పోషణ పక్వాడా షెడ్యూల్‌లో భాగంగా చిన్నపిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని సూచించారు. పిల్లలకు చిన్న వయసులోనే ఫోన్ అలవాటు చేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా భోజన సమయంలో పిల్లలకు ఫోన్ ఇవ్వకుండా, కథలు చెప్పడం ద్వారా మంచి అలవాట్లు పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలందరినీ అంగన్వాడి కేంద్రాలకు పంపించి, వారి శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. కార్యక్రమం అనంతరం ఇద్దరు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, ముగ్గురు చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పోషణ పక్షం ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, గర్భిణీ మహిళలు, బాలింతలు, గ్రామ మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు వెన్నెల, రజిత, స్వప్న, ఆశ వర్కర్, అంగన్వాడీ ఆయాలు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రభుత్వం చేపడుతున్న పోషణ పథకాలపై గ్రామస్థుల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..