గురుకులంలో సమస్యల పరిష్కారానికి చర్యలు
మన భారత్, మొగుళ్ళపల్లి: భూపాలపల్లి జిల్లాలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయంలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, విద్యార్థులకు అన్ని అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. బుధవారం నిర్వహించిన వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం కింద విద్యాశాఖ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గురుకుల విద్యాలయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో చర్చించిన కలెక్టర్,...