ఎమ్మెల్యే పర్యటన విజయవంతం చేయాలి..
మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: తాంసీ మండల కేంద్రంలో బుధవారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలకు ఆహ్వానం పలికారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చేతుల మీదుగా ఉదయం 9:30 గంటలకు సబ్ మార్కెట్ యార్డ్లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు మద్దతు ధరతో పంట కొనుగోలు చేయడం ప్రారంభమవుతుందని, స్థానిక రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచించారు. రైతులకు నేరుగా లాభం చేకూరే విధంగా...