హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి పేరిట జరుగుతున్న చర్యలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను నాశనం చేస్తున్నారని ఆరోపిస్తూ, “పనికిమాలిన హైడ్రాను తొలగించాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు. ముఖ్యంగా మూసీ నది అభివృద్ధి పేరుతో భూములను కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. నగర అభివృద్ధి నిజంగా ప్రజల ప్రయోజనాల కోసం ఉండాలని, భూముల...