చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..
మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ సూపర్వైజర్ రజిత పేర్కొన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరేపల్లి, మొగుళ్లపల్లిలోని 4, 5 అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన “గ్రాడ్యుయేషన్ డే” కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నపిల్లల మెదడు అభివృద్ధిలో తొలి ఐదు సంవత్సరాలు అత్యంత కీలకమని వివరించారు. ఈ సమయంలో పిల్లలకు...