సీఎం పర్యటన.. ఇసుక రవాణా నిషేధం
మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల భాగంగా ఇసుక రవాణాను తాత్కాలికంగా నిషేధించినట్లు మొగుళ్లపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ తెలిపారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. జిల్లాలో సీఎం పర్యటన సజావుగా సాగేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇసుక రవాణాపై...