manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 10:58 am Editor : manabharath

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

మన భారత్, ఆదిలాబాద్:
నెరడిగొండ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో నాఫెడ్ సహకారంతో, తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ నెరడిగొండలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక రైతులు, అధికారులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని స్పష్టంగా సూచించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకుని సరైన ధరలకు తమ పంటలను అమ్ముకోవాలని ఆయన సూచించారు. కష్టపడి పండించిన పంటలను తక్కువ ధరలకు అమ్మితే రైతులకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.

అధికారులు రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తూ, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారికి సరైన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభంతో స్థానిక రైతులకు ఉపశమనం లభిస్తుందని ఆశాభావం వ్యక్తమైంది.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..