manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 7:35 am Editor : manabharath

జిల్లాలో రాత్రికి వర్ష సూచన..

మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు (29-04-2026) తీవ్ర ఎండలతో పాటు రాత్రి వేళల్లో వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ సమాచారం తెలియజేస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, సాయంత్రం తర్వాత వాతావరణంలో మార్పు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. జైనథ్ మండలంలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగే సూచనలు ఉన్నాయి. అలాగే జైనథ్, సాత్నాల, బేల మండలాల్లో సాయంత్రం 4 గంటల వరకు 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.

అయితే సాయంత్రం 7 గంటల తర్వాత జిల్లాలో వాతావరణంలో మార్పు చోటుచేసుకుని, మేఘావృత పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. రాత్రి 8 గంటల నుంచి 8:40 వరకు, అలాగే 10 గంటల నుంచి 10:40 మధ్య ఇచ్చోడ, సిరికొండ, గుడిహత్నూర్, బజార్ హత్నూర్, నేరడిగొండ, బోథ్, సోనాల, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ మండలాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అదేవిధంగా తాంసి, తలమడుగు మండలాల్లో రాత్రి 9 గంటల నుంచి 9:40 వరకు వర్ష సూచనలు ఉండగా, ఆదిలాబాద్, భోరజ్ ప్రాంతాల్లో రాత్రి 10 నుంచి 10:40 మధ్య వర్షం పడే అవకాశం ఉంది. బేల మండలంలో రాత్రి 11 నుంచి 11:20 వరకు వర్షపాతం సంభవించే సూచనలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఎండల నుండి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, రాత్రి వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..