manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 1:18 am Editor : manabharath

బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి సన్మానం..

ఆదిలాబాద్, మన భారత్:
బోథ్ కౌట వాస్తవ్యులు సింగిడి సురేందర్ రెడ్డి  ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయం సాధించి తొలిసారిగా ఆదిలాబాద్‌కు విచ్చేసిన సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తలమడుగు మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి గారు శాలువాతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సురేందర్ రెడ్డి  విజయం ఆదిలాబాద్ జిల్లాకు గర్వకారణమని, ఆయన న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని గోక గణేష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

సింగిడి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ, బార్ అసోసియేషన్ అభివృద్ధికి, న్యాయవాదుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ఈ సన్మానం తనకు మరింత బాధ్యతను గుర్తు చేస్తోందని పేర్కొన్నారు.

ఈ సన్మాన కార్యక్రమం ఆదిలాబాద్‌లో న్యాయ వర్గాల ఐక్యతను ప్రతిబింబించిందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.

మీరు మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..