manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 4:11 pm Editor : manabharath

మాజీ వైస్ ఎంపీపీకి ఘన సన్మానం..

మన భారత్, తలమడుగు :

ప్రమాద సమయంలో సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణ రక్షణకు తోడ్పడిన బీఆర్ఎస్ మాజీ వైస్ ఎంపీపీ ముచ్చ రఘు ను తాంసి పోలీసులు ఘనంగా సన్మానించారు. తాంసి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నారి గ్రామానికి చెందిన ముచ్చ రఘు, మెయిన్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

అంతేకాకుండా, 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. అతని అప్రమత్తత వల్ల బాధితుడికి తక్షణ చికిత్స అందినట్లు పోలీసులు తెలిపారు.జిల్లా ఎస్పీ అఖిల్ ఆదేశాల మేరకు, ఎస్సై జీవన్ రెడ్డి పర్యవేక్షణలో శనివారం ముచ్చ రఘును పోలీసులు అభినందించి సన్మానించారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ప్రమాదాల సమయంలో ప్రజలు భయపడకుండా ముందుకు వచ్చి సహాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై ఉత్తమ్, రమేష్, పొచ్చన్న, సాగర్, రామారావు తదితర తాంసి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..