manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 3:08 am Editor : manabharath

ఆ పథకానికి దరఖాస్తుల గడువు పొడిగింపు..

మన భారత్, ఆదిలాబాద్ : 

షెడ్యూల్డ్ కులాల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా అమలు చేస్తున్న పశుపోషణ పథకానికి దరఖాస్తుల గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆసక్తి గల ఎస్సీ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

ఈ పథకం ద్వారా పశుసంవర్ధక రంగంలో ఉపాధి అవకాశాలను పెంపొందించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgobmms.cgg.gov.in/

క్రింద ఉన్న లింక్ క్లిక్ చేయండి..

https://tgobmms.cgg.gov.in/

ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అలాగే, ఆన్లైన్‌లో దరఖాస్తు సమర్పించిన తర్వాత దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని అవసరమైన పత్రాలతో పాటు సంబంధిత మండల కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. అన్ని వివరాలు సమగ్రంగా పరిశీలించిన అనంతరం అర్హులైన వారికి పథకం ప్రయోజనాలు అందజేయబడతాయని పేర్కొన్నారు.

దరఖాస్తుల గడువు పొడిగింపు ద్వారా మరింత మంది లబ్ధిదారులు ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం కలుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.