manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 4:15 pm Editor : manabharath

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్:

తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ మండల కేంద్రంలో శుక్రవారం ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలని, 2026 జూన్ 2 లోపు పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను ఒకేసారి చెల్లించాలని కోరారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ అనంతరం వెంటనే అన్ని ప్రయోజనాలు అందించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సీపీఎస్ రద్దు అంశాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

నిరసన అనంతరం తమ డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని మండల తహసీల్దార్ సింధుజకు సమర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు, మండలంలోని పాఠశాలల ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త.. https://manabharath.com/7179/

మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..