manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 2:53 pm Editor : Editor Vishal Kumar

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్:

మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన రహదారిపై అక్రమంగా నిర్మించిన డబ్బాలు (షెడ్లు/నిర్మాణాలు) ట్రాఫిక్‌కు అడ్డంకిగా మారుతున్న నేపథ్యంలో, వాటిని వెంటనే తొలగించాలని గ్రామ సర్పంచ్ చాట్ల విజయ ఆదేశించారు.

స్థానికుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ట్రాఫిక్ జామ్ సమస్యలు పెరుగుతున్న పరిస్థితిని పరిశీలించిన సర్పంచ్ చాట్ల విజయ స్వయంగా స్పందించి చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా మొగుళ్లపల్లి మెయిన్ రహదారిపై నిర్మించిన డబ్బాల వల్ల వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, అత్యవసర సేవలు కూడా ఆలస్యమవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు.

ఈ నేపథ్యంలో రహదారిపై నిర్మాణాలు చేసిన యజమానులకు గ్రామపంచాయతీ పాలకవర్గం నోటీసులు జారీ చేసింది. వెంటనే డబ్బాలను తొలగించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రహదారులను సులభంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించాలన్నదే లక్ష్యమని సర్పంచ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు, వార్డ్ సభ్యులు మల్సాని రాజేశ్వర్ రావు, చిలుకమారి శ్రీనివాస్, అర్షం మహేష్, బండారి కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తగ్గించే దిశగా గ్రామపంచాయతీ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

రాజకీయ నాయకులకు శుభవార్త.. https://manabharath.com/7179/

మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..