తాంసి, మన భారత్:
జామిడి గ్రామ సర్పంచ్ ఈరగొల్ల అశోక్ తన కుమారుడు ఈరగొల్ల అద్వైత్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అద్వైత్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
సాధారణ వేడుకలకు భిన్నంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ మొక్కలు నాటడం ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని ముఖ్యమైన సందర్భాల్లో కనీసం రెండు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. చెట్లు మన భవిష్యత్తుకు ఎంతో అవసరమని, పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూడా పాల్గొని మొక్కలు నాటారు. పుట్టినరోజును సామాజిక బాధ్యతతో జరుపుకోవడం మంచి ఆచరణగా నిలుస్తుందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.
రాజకీయ నాయకులకు శుభవార్త..!
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
