ఉద్యమంతోనే సమస్యల పరిష్కారం..
మన భారత్, నారాయణపేట : పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటే ప్రభుత్వంపై బలంగా ప్రతిఘటన చేయాల్సిందేనని టీజీఈ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. నారాయణపేటలో గురువారం నిర్వహించిన సమావేశంలో తపస్ జిల్లా అధ్యక్షుడు నరసింహ మాట్లాడుతూ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాటికి పీఆర్సీ (PRC) ప్రకటించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దశలవారీగా చేపట్టనున్న ఉద్యమానికి ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు చేయూతనివ్వాలని...