రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన..
నారాయణపేట, మన భారత్: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం భాగంగా నారాయణపేట జిల్లా జాజాపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి నారాయణపేట రూరల్ ఎస్సై సతీష్ రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను తీవ్రంగా...