manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 10:32 am Editor : manabharath

విద్యుత్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి..

 మన భారత్, నారాయణపేట:

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట్ జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్యాలయం ముందు జరుగుతున్న నిరవధిక సమ్మెకు TUCI కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

ఈ సమ్మె శిబిరాన్ని TUCI జిల్లా ఉపాధ్యక్షులు కె. కాశీనాథ్, TUCI విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకుడు అంబదాస్ సందర్శించి కార్మికులతో ఐక్యత వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విద్యుత్ కార్మికుల సమ్మెకు ప్రజలు, విద్యుత్ వినియోగదారులు, మేధావులు, అలాగే పర్మినెంట్ ఉద్యోగులు మద్దతు తెలపాలని వారు పిలుపునిచ్చారు.

కార్మికులు గత 20–25 సంవత్సరాలుగా తక్కువ జీతాలతో విద్యుత్ శాఖలో పనిచేస్తూ శ్రమకు తగిన ఫలితం పొందడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ విధానంలో పని చేయడం వల్ల వారు శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆరోపించారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్త ఆర్థిక విధానాల పేరిట కాంట్రాక్టీకరణ విధానాన్ని ప్రోత్సహిస్తూ కార్మిక హక్కులను దెబ్బతీస్తోందని విమర్శించారు. ఈ కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికులు ఐక్యంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం తక్షణమే విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో CITU నాయకులు వెంకటరామిరెడ్డి, బలరాం, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల నాయకుడు నీలి దామోదర్, వర్కర్స్ యూనియన్ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..