manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 10:14 am Editor : manabharath

జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..!

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మరింతగా మండిపోతున్నాయి. ప్రస్తుతం మధ్యాహ్నం 2:07 గంటల సమయానికి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.

మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య గరిష్టంగా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత చేరుకునే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు 41 డిగ్రీలు, 5 నుండి 6 గంటల వరకు 40 డిగ్రీలు నమోదు కానున్నాయి. సాయంత్రం వేళలో కూడా ఎండల ప్రభావం తగ్గకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశముంది.

అలాగే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు 37 డిగ్రీలు, రాత్రి 7 నుండి 8 గంటల మధ్య 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. రాత్రి సమయంలో కూడా వేడి పూర్తిగా తగ్గకపోవడం గమనార్హం.

వైద్యులు, అధికారులు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని, ఎక్కువగా నీరు తాగాలని, తలపై కవర్ ధరించాలని సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండి, వడదెబ్బ నుంచి రక్షణ పొందే చర్యలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరుతున్నారు.

 

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..