వడదెబ్బతో చనిపోతే రూ.4 లక్షల పరిహారం..
హైదరాబాద్, మన భారత్:తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బతో ప్రాణాలు కోల్పోతున్న వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా అందిస్తోంది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF) కింద అర్హులైన కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వడదెబ్బ కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలు ఈ పరిహారం పొందేందుకు నిర్దిష్ట పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా జారీ చేసిన పోస్టుమార్టం రిపోర్టు, పోలీస్ FIR కాపీ, డెత్...