manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 3:24 pm Editor : manabharath

ఇదేం అన్యాయం.. అధిక వడ్డీ బాధితుల ఆవేదన..!

మన భారత్ ,ఆదిలాబాద్ :

ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకా నగర్‌లో ఉన్న Muthoot Finance బ్రాంచ్‌పై అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు, అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని సంస్థ అధిక వడ్డీ విధిస్తున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

స్థానిక మున్సిపల్ కార్మికుడు చిరంజీవి మాట్లాడుతూ, తాను నెల క్రితం మూడు తులాల బంగారం మీద రూ.2,70,000 గోల్డ్ లోన్ తీసుకున్నానని తెలిపారు. అయితే, తాజాగా వడ్డీ చెల్లించడానికి బ్రాంచ్‌ను సంప్రదించగా, నెల రోజులు పూర్తయ్యాక కేవలం ఆరు రోజులు ఆలస్యమైనందుకు సుమారు రూ.5,200 వడ్డీ అడిగారని చెప్పారు. ఆరు రోజులకు రూ.2,000 వరకు అదనపు వడ్డీ విధించారని ఆయన వాపోయారు.

ఇక స్థానికులు మాట్లాడుతూ, గోల్డ్ లోన్ ఒప్పందాలు ఎక్కువగా ఇంగ్లీషులో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పూర్తిగా అర్థం కావడం లేదని పేర్కొన్నారు. సంస్థ అధికారులు సరైన వివరణ ఇవ్వకుండా ఒప్పందాలపై సంతకాలు తీసుకుని, తరువాత అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించి, బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. గోల్డ్ లోన్ సంస్థలు పారదర్శకంగా వ్యవహరించి, కస్టమర్లకు స్పష్టమైన సమాచారం అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రెండు తులాల గోల్డ్  పెడితే దాన్ని కస్టమర్ రాకున్నా విక్రయించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

__________________________________________

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..