వావ్… కూరగాయలతో అంబేద్కర్ చిత్రకళ.!
మన భారత్, నారాయణపేట, ఏప్రిల్ 14 : నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామానికి చెందిన చిత్రకళ ఉపాధ్యాయుడు కంగలి వెంకటేష్ తన సృజనాత్మకతతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా అంబేద్కర్ చిత్రాలను రూపొందించడం విశేషం. ఈ ఏడాది కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా వెంకటేష్ తనదైన శైలిలో కూరగాయలతో అంబేద్కర్ చిత్రాన్ని రూపొందించి అందరినీ...