manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 1:57 pm Editor : manabharath

వావ్… కూరగాయలతో అంబేద్కర్ చిత్రకళ.!

మన భారత్, నారాయణపేట, ఏప్రిల్ 14 :

నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామానికి చెందిన చిత్రకళ ఉపాధ్యాయుడు కంగలి వెంకటేష్ తన సృజనాత్మకతతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా అంబేద్కర్ చిత్రాలను రూపొందించడం విశేషం.

ఈ ఏడాది కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా వెంకటేష్ తనదైన శైలిలో కూరగాయలతో అంబేద్కర్ చిత్రాన్ని రూపొందించి అందరినీ ఆకట్టుకున్నారు. సాధారణంగా అందుబాటులో ఉండే కూరగాయలను వినియోగించి అద్భుతంగా రూపుదిద్దిన ఈ చిత్రం గ్రామస్థులను, విద్యార్థులను ఆశ్చర్యానికి గురిచేసింది.

చిత్రకళపై తనకున్న ఆసక్తి, ప్రతిభను వినూత్నంగా ప్రదర్శిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని గ్రామ ప్రజలు అభిప్రాయపడ్డారు. పాఠశాల ఉపాధ్యాయులు కూడా వెంకటేష్ ప్రతిభను కొనియాడుతూ, విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో ఆయన చేస్తున్న కృషిని అభినందించారు.

ఇలాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో చైతన్యం కలిగించడం ఆనందకరమని స్థానికులు పేర్కొన్నారు.


రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..