manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 7:03 am Editor : Editor Vishal Kumar

అంబేద్కర్ రాజ్యాంగంతోనే ఎమ్మెల్యే అయ్యా..!

మన భారత్,ఆదిలాబాద్ :

రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండలో ఘనంగా నిర్వహించిన ఉత్సవాల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, డా. అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం, సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు. సమానత్వం, హక్కులు, అవకాశాలు ప్రతి పౌరుడికి అందేలా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ వ్యవస్థ వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని, ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని ఆయన అన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు అభివృద్ధి దిశగా అంబేద్కర్ చూపిన మార్గం అందరికీ ఆదర్శమని తెలిపారు.

ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆలోచనలు, విలువలను ఆచరణలో పెట్టాలని, సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..